
(శ్రీరామ్ చక్రి )12/5/2026,ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు టి. హరీశ్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అలాగే కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఎస్. మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కల్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ, డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, డా. బండా ప్రకాష్ ముదిరాజ్ ఎమ్మెల్సీ, వి. గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ ఎంపీ, నారదాసు లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్సీ, ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్, టి. జీవన్ రెడ్డి మాజీ మంత్రి, సోమా భరత్ కుమార్ గుప్తా మాజీ చైర్మన్, సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్సీ, రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.ప్రత్యేక ఆహ్వానితులుగా కె.ఆర్. సురేష్ రెడ్డి మాజీ ఎంపీ, మహమ్మద్ అలీ మాజీ మంత్రి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ చైర్మన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్చార్జిల నియామకం, పార్టీ బలోపేతం తదితర కీలక అంశాలపై కేసీఆర్ అధ్యక్షతన విస్తృతంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి
