సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంలా మారింది. సకాలంలో ధాన్యం కొనకపోవడంతో నిండా మునగాల్సి వస్తున్నది. మంగళవారం రాత్రి 8గంటల తర్వాతి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు పడిన అకాల వర్షంతో రెక్కల కష్టం నీళ్లపాలయింది

సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంలా మారింది. సకాలంలో ధాన్యం కొనకపోవడంతో నిండా మునగాల్సి వస్తున్నది. మంగళవారం రాత్రి 8గంటల తర్వాతి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు పడిన అకాల వర్షంతో రెక్కల కష్టం నీళ్లపాలయింది. పంట కొంటారని రోజుల కొద్ది చూసినా చివరకు నష్ట పోవాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం తర్వాత ఆకాశం మేఘావృతమై, ఒక్కసారిగా గాలి దుమారం లేచింది. కాసేపట్లోనే వర్షం మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు
