కోట్లాది నిధులు వెచ్చించి నిర్మించిన ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ప్రారంభానికి ముందే పాడయ్యింది. తెలంగాణలోనే అతిపెద్ద నాలుగు లేన్ల ఈ వంతెన గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారింది. దీనిపై ప్రయాణం కష్టంగా మారడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.

కమలాపూర్, మే 30 : కోట్లాది నిధులు వెచ్చించి నిర్మించిన ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ప్రారంభానికి ముందే పాడయ్యింది. తెలంగాణలోనే అతిపెద్ద నాలుగు లేన్ల ఈ వంతెన గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారింది. దీనిపై ప్రయాణం కష్టంగా మారడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద గత బీఆర్ఎస్ హయాంలో పరకాల-హుజురాబాద్ రహదారిపై ఆర్వోబీ నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు.
