వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పోలీసు న్యాయ సాయం అందించడానికి పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సరికొత్తగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పూనుకున్నారు. నేరుగా బాధితుల నుంచి సమస్యలను తెలుసుకొని, ఆర్జీలను స్వీకరించి, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.

సుబేదారి, జూన్ 1: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పోలీసు న్యాయ సాయం అందించడానికి పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సరికొత్తగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పూనుకున్నారు. నేరుగా బాధితుల నుంచి సమస్యలను తెలుసుకొని, ఆర్జీలను స్వీకరించి, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు. ఇక నుంచి పోలీసు బాస్కే బాధితులు నేరుగా తమ సమస్యను విన్నవించుకొని, న్యాయం సాయం పొందే అవకాశం వచ్చింది. సీపీ తీసుకున్న సరికొత్త వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది.
