తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకేంద్రాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాకేంద్రాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
