కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కరీంనగర్ నగరపాలక సంస్థ ర్యాంకు మెరుగుపడేనా అంటే ఆ అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

కార్పొరేషన్, మే 31: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో కరీంనగర్ నగరపాలక సంస్థ ర్యాంకు మెరుగుపడేనా అంటే ఆ అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరాల పరిశుభ్రత, పారిశుధ్య స్థాయిలను అంచనా వేసే ఈ సర్వేలో బీఆర్ఎస్ హయాంలో జాతీయ స్థాయిలో వందలోపు ర్యాంకు సాధించగా.. రాష్ట్ర స్థాయిలో రెండు, మూడు స్థానాల్లో నిలిచింది. గత రెండేళ్లుగా మాత్రం ర్యాంకింగ్లో వెనుకబడుతున్నది.
