మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.

నవీపేట, మే 31: మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని నిజాంపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమంగా తరలించడం గమనార్హం. కొన్నిరోజులుగా నిజాంపూర్ వాగులో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు.
