ఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను హైదారాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

చెన్నూర్, మే 31 : బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను హైదారాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అణగదొక్కుతున్నదని ఆరోపించారు.
