మాటలు కోట దాటితే… చేతలు గడప దాటడం లేదన్నట్లుగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరు. వచ్చే డిసెంబర్‌కు మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేదు. ఐదేళ్ల పరిపాలనలో సగం రోజులు గడిపేసినప్పటికీ వాగ్ధానాల అమలులో అతీగతీ కరువైంది.

నిజామాబాద్, మే 31, : మాటలు కోట దాటితే… చేతలు గడప దాటడం లేదన్నట్లుగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన తీరు. వచ్చే డిసెంబర్‌కు మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేదు. ఐదేళ్ల పరిపాలనలో సగం రోజులు గడిపేసినప్పటికీ వాగ్ధానాల అమలులో అతీగతీ కరువైంది. రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్‌లో కల్లబొల్లి మాటలు వల్లించారు. పీసీసీ చీఫ్ హోదాలో నాడు రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లుగా హామీలు గుప్పించాడు. కేసీఆర్ పాలనలో సవ్యంగా అమలవుతోన్న రైతుబంధు పెట్టుబడి సాయం పథకాన్ని ఎద్దేవా చేశాడు. సంవత్సరానికి మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలంటూ మాట్లాడాడు. ఎందుకివ్వకూడదంటూ నాడు బీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీశాడు. రైతులను లేనిపోని ఆశచూపి రెచ్చగొట్టాడు.
