కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఝూటా మాటలే. గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ‘తానా’ అంటే ‘తందానా..’ అంటూ భజన చేయడం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతైంది

రఘునాథపాలెం, మే 31 : కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఝూటా మాటలే. గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ‘తానా’ అంటే ‘తందానా..’ అంటూ భజన చేయడం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి చేసిన పనికి ‘పది’ంతలు గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. రైతులకు అమలు చేస్తామన్న రుణమాఫీ దగ్గర్నుంచి మొదలుకొని ధాన్యం కొనుగోలుకు క్వింటాపై ఇస్తామన్న రూ.500 బోనస్ వరకు.. ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో పక్కాగా అమలు చేసింది లేదు.
