పశ్చిమ బెంగాల్లోని, ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగిర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

పశ్చిమ బెంగాల్లోని, ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగిర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎన్నిక జరగడానికి రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇది టీఎంసీ పార్టీకి భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 21న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.
