పోక్సో కేసు ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాసంఘాలు, విద్యార్థులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

పోక్సో కేసులో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజాసంఘాలు, విద్యార్థులతోపాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో పిల్లలు అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశం ఉంటుంది. దానికే రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదని బండి సంజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ అతన్నేమైనా రక్షించి రాకుండా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం.. ఆయన హోంమంత్రిగా ఉన్నాడు. అయినా కానీ ఆయన వచ్చారు సరెండర్ అయ్యారు. కేసు పెట్టారు. మళ్లీ ఇప్పుడు వేరే రకంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఇవన్నీ చట్టం ప్రకారం జరుగుతయన్నారు.
