31 May 2026 2:27 PM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసంతో యువత, ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని మహేశ్వరం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు.
(శ్రీరామ్ చక్రి న్యూస్ )| మీర్ పేట్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసంతో యువత, ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని మహేశ్వరం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు. ఆదివారం బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుడు మేకల కృష్ణతో పాటు పలువురు కాలనీ వాసులు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో అందెల శ్రీరాములు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో బీజేపీకి ఆదరణ పెరుగుతోందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శులు నీలా రవి నాయక్, విజయలక్ష్మి రాజు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సిద్ధాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు స్థూల ప్రభాకర్, తులసి వెంకటేశ్వర్లు, కిషోర్, తుమ్మల రమేష్, జగన్ ముదిరాజ్, భాస్కర్, శ్రీను, శశి, లక్ష్మణ్, లింగస్వామి, సత్యనారాయణ, వెంకట్, మెరుగు శంకర్, రవికుమార్, శ్రీనివాస్, జి. శ్రీనివాస్, రమేష్, బండి వెంకటేష్, మల్లయ్య, మహేష్, వెంకటేష్, సైదులు, సిద్ధార్థ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
