అదిగో ఒప్పందం.. ఇదిగో దిగ్బంధనం ఎత్తేస్తున్నాం.. హొర్ముజ్లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు తమ దేశాలకు వెళ్లిపోవచ్చు.. అంటూ ఆర్భాటపు ప్రకటను చేసిన అమెరికా అధ్యక్షుడు.. తీరా కార్యాచరణకు వచ్చేటప్పుటికి తుస్ మనిపించారు.

వాషింగ్టన్, మే 30: అదిగో ఒప్పందం.. ఇదిగో దిగ్బంధనం ఎత్తేస్తున్నాం.. హొర్ముజ్లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు తమ దేశాలకు వెళ్లిపోవచ్చు.. అంటూ ఆర్భాటపు ప్రకటను చేసిన అమెరికా అధ్యక్షుడు.. తీరా కార్యాచరణకు వచ్చేటప్పుటికి తుస్ మనిపించారు. దీంతో ఇరాన్, అమెరికా అధినేతల వైఖరిని చూస్తే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడే పరిస్థితి కన్పించడం లేదు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి 60 రోజుల ముసాయిదా సిద్ధమైందని, ట్రంప్ అనుమతి ఇవ్వడమే మిగిలి ఉన్నదని తొలుత ప్రచారం జరిగింది.
