సన్న వడ్లకు క్వింటాక్ రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీకి సున్నం పెడుతున్నది. గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన వడ్ల బోనస్ నేటికీ రైతుల ఖాతా లో పడకపోగా ప్రస్తుత సీజన్లో అసలు కొనుగోళ్లనే బంద్ చేసింది.

సూర్యాపేట, జూన్ 1 : సన్న వడ్లకు క్వింటాక్ రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీకి సున్నం పెడుతున్నది. గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన వడ్ల బోనస్ నేటికీ రైతుల ఖాతా లో పడకపోగా ప్రస్తుత సీజన్లో అసలు కొనుగోళ్లనే బంద్ చేసింది. ఈ సీజన్‌కు సంబంధించి సుమారు రెండు నెలల క్రితం కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తే జిల్లాలో పండించిన పంటలో ఒక్క శాతం కూడా సన్నాలను కొనుగోలు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 6.70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాగా ఉంటే ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 6,036 మెట్రిక్ టన్నులు మాత్ర మే కావడం గమనార్హం.
