నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి వంటి మండలాల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వాహనదారులు జిల్లా కేంద్రానికి పరుగుతీశారు.

నాగర్కర్నూల్, జూన్ 1 : నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం డీజిల్ కొరత ఏర్పడింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి వంటి మండలాల్లోని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో రైతులు, వాహనదారులు జిల్లా కేంద్రానికి పరుగుతీశారు. దీంతో డీజిల్ స్టాక్ ఉన్న ఒకే బంకుల్లో (పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే..) వాహనదారులు, రైతులు, వినియోగదారులు డబ్బాలు, క్యాన్లు పట్టుకొని బారులుదీరారు.
