పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం బిల్లులు లబ్ధిదారులకు అందడంలేదు.

యాదాద్రి భువనగిరి, జూన్ 1 : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం బిల్లులు లబ్ధిదారులకు అందడంలేదు. జిల్లాలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులు రాక పరేషాన్ అవుతున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకొని చివరి దశ బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 4591 ఇండ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులు నిధుల కోసం నెలలుగా నిరీక్షిస్తున్నారు. అప్పులు తెచ్చి ఇండ్లు కట్టి ఇప్పుడు పైసల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
