
బడంగ్ పేట్ కార్పొరేషన్: జిల్లెలగూడ, అక్టోబరు 19 (శ్రీరామ్ చక్రీ న్యూస్): జిల్లెలగూడ న్యూ వివేక్‌నగర్ కాలనీలో జై మాతా దీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అష్టమి రోజున దుర్గాదేవిగా, నవమి రోజున మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి కాలనీవాసులు, మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల భాగస్వామ్యంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
