
మహేశ్వరం న్యూస్ – 5 మే 2026(శ్రీరామ్ చక్రి న్యూస్)
పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లా, తుల్జాపూర్లో ప్రసిద్ధి చెందిన తుల్జా భవానీ అమ్మవారిని మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి పి. సబితా ఇంద్రా రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు పొందారు.
సబితమ్మ పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా, ఆమె తుల్జాపూర్లోని తుల్జా భవానీ ఆలయాన్ని దర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది.
