
మహేశ్వరం న్యూస్ – 5 మే 2026ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. రైతు ప్రభుత్వంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని ఆయన హామీ ఇచ్చారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ రాద్ధాంతం సృష్టిస్తున్నదని, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని లక్ష్మారెడ్డి ఆరోపించారు.మహేశ్వరం, కందుకూరు మండలాల వ్యవసాయ అధికారులతో ఆయన మాట్లాడి, అకాల వర్షాలు వచ్చినా ప్రతీ గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కాంగ్రెస్ నాయకులు కూడా కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు రాకుండా అండగా నిలవాలని అన్నారు.వేసవి తీవ్రత దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందించాలని అధికారులకు సూచించారు.రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం, బోనస్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతున్నదని లక్ష్మారెడ్డి విమర్శించారు.గత బీఆర్ఎస్ పాలనలో రైతు రుణమాఫీ జరగలేదని, అన్నదాతలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్దకు రావడం ఏమిటని ప్రశ్నించారు.
