
రంగారెడ్డి జిల్లా న్యూస్, ( శ్రీరామ్ చక్రి న్యూస్)
గాయత్రి నగర్లో హిందూ సమ్మేళన కార్యక్రమం – కళాకారుల సన్మానం
గాయత్రి నగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తూ అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసిన రజిని రాజ్పుత్ మరియు వారి గ్రూప్ టీమ్ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి పాల్గొని కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో రాములు, మహాజన్, సిద్దాల శ్రీనివాస్, సత్తయ్య, సుధాకర్, దివాకర్, నాగేశ్వరరావు, జెడి పవన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మద్ది రాజశేఖర్ రెడ్డి పాల్గొని, యువతలో సాంస్కృతిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని తెలిపారు.
