
మహేశ్వరం, జూన్ 10 (శ్రీరామ్ చక్రి న్యూస్): మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు, తీగల కృష్ణారెడ్డి కాలేజీలో ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ తీగల కృష్ణారెడ్డి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
