రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా ఏవో సాకులు చూపుతూ మిల్లుల వద్ద మళ్లీ ధాన్యం కోత విధిస్తేనే తప్ప దిగుమతి చేసుకునేది లేదంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిప్పర్తి, ఏప్రిల్ 17: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, మిల్లర్లు కొర్రీలతో పంటను అమ్ముకునే పరిస్థితి లేదంటూ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా ఏవో సాకులు చూపుతూ మిల్లుల వద్ద మళ్లీ ధాన్యం కోత విధిస్తేనే తప్ప దిగుమతి చేసుకునేది లేదంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడం కష్టతరంగా మారిందని తిప్పర్తి మండలం రామలింగాల గూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామలింగాలగూడెం ఐకేపీ సెంటర్లో కొర్వేనిగూడెం, రామలింగాలగూడెం, కంకణాలపల్లి, చర్లగూడెం రైతులు సుమారు 120 ధాన్యపు రాశులను ఇప్పటి వరకు పోశారు
