జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. జిల్లా ప్రజలు ఉష్ణ తాపానికి తట్టుకోలేక అల్లాడుతున్నారు. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలోని అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం తొమ్మిది గంటల నుంచే జనం బయటకు రావాలంటే జంకుతున్నారు.

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. జిల్లా ప్రజలు ఉష్ణ తాపానికి తట్టుకోలేక అల్లాడుతున్నారు. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాలోని అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం తొమ్మిది గంటల నుంచే జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. రాత్రి పదైనా ఇండ్లు చల్లబడటం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లల్లో ఉన్నా ఉక్కపోతను తట్టుకోలేపోతున్నారు. ఈ ఎండలు మే చివరి వరకు తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి వానలు సరిగా లేకపోవడం కూడా ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమైంది.
