గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పెద్ది సినిమాను కూడా జపాన్‌లో ఒకేసారి విడుదల చేస్తే మంచి స్పందన వస్తుందని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. జపాన్ అభిమానులు కూడా ఈ వార్తతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే విడుదలకు కొద్ది రోజుల ముందు చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొన్ని అనివార్య కారణాల వల్ల జపాన్‌లో పెద్ది సేమ్ డే రిలీజ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 4న సినిమా అక్కడ విడుదల కానట్లైంది.ఈ వార్తతో జపాన్‌లోని రామ్‌చరణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
