ఖమ్మం జడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్(Sonovision) దుకాణంలో భారీ చోరీ(Major theft )జరిగింది.

హైదరాబాద్ : ఖమ్మం జడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్ దుకాణంలో భారీ చోరజరిగింది. బుధవారం అర్ధరాత్రి దుకాణం తాళాలు పగులగొట్టి షాపులోకి చొరబడిన దుండగులు రూ.కోటి విలువైన వందకు పైగా సెల్ఫోన్స్ ఎత్తుకెళ్లారు. గమనించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
