పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది.

న్యూఢిల్లీ, జూన్ 10: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరపగా ఆ దేశాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేసి భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. జోర్డాన్‌లోని అల్-అజ్రాక్ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. అల్-అజ్రాక్ ప్రాంతం వైపు ఇరాన్ ప్రయోగించిన ఐదు క్షిపణులను అడ్డుకుని, కూల్చివేసినట్లు జోర్డాన్‌కు చెందిన సాయుధ దళాలు బుధవారం తెలిపాయి. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు వైమానికి లక్ష్యాలను ఎదుర్కొంటున్నట్లు కువైట్ సైన్యం పేర్కొన్నది.
