ఎయిర్ అరేబియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని కొచ్చిన్లో ల్యాండ్ చేశారు. వాస్తవానికి ఆ విమానం 170 మంది ప్రయాణికులతో కోజికోడ్ వెళ్లాల్సి ఉంది. అయితే సురక్షితంగా ఆ విమానాన్ని కొచ్చిన్లో దించారు.

కొచ్చిన్: షార్జా నుంచి కోజికోడ్ చేరుకోవాల్సిన ఎయిర్ అరేబియా(Air Arabia) విమానాన్ని ఇవాళ దారి మళ్లించారు. ఆ విమానం కొచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల దాన్ని దారి మళ్లించారు. ఎయిర్ అరేబియా ఫ్లయిట్ జీ9 454 విమానంలోని ఇంజిన్ రివర్స్ త్రస్ట్ సిస్టమ్లో సాంకేతిక సమస్య తలెత్తిందని, దాని వల్ల దాన్ని కొచ్చిన్లో దించారని కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు.
