సూర్యాపేట మున్సిపాల్టీ పరిధిలోని చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్వహణ తీరుపై జిల్లా కలెరక్టర్ తేజస్ నందలాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు

సూర్యాపేట, మే 31 : సూర్యాపేట మున్సిపాల్టీ పరిధిలోని చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్వహణ తీరుపై జిల్లా కలెరక్టర్ తేజస్ నందలాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిపై మాట్లాడుతూ యూజీడీ పనులు అత్యంత నిర్లక్ష్యంగా సాగుతున్నాయని మండిపడ్డారు
