కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పంట అమ్ముకోవటానికే కాదు..అమ్మిన పంటల బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో తిరుమలగిరి, సూర్యాపేట, చిలుకూరులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు కేంద్రాల్లో 869 మంది రైతుల నుంచి 49,286 క్వింటాల మక్కలు కొనుగోలు చేశారు.

తిరుమలగిరి, మే 31 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పంట అమ్ముకోవటానికే కాదు..అమ్మిన పంటల బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో తిరుమలగిరి, సూర్యాపేట, చిలుకూరులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు కేంద్రాల్లో 869 మంది రైతుల నుంచి 49,286 క్వింటాల మక్కలు కొనుగోలు చేశారు. వీరందరికి రూ.11 కోట్ల 82 లక్షల 87 వేలు వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. 40 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు పడలేదు. దీనితో వాన కాలం సీజన్ పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఇబ్బందులు పడుతూ బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
