

జూన్ 17 (శ్రీరామ్ చక్రి న్యూస్) బడంగ్పేట్ సర్కిల్, ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్లో శ్రీశ్రీశ్రీ దుర్గాభవాని సమేత శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు,వెల్లివిరియాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అర్కల భూపాల్ రెడ్డి, అనిల్ యాదవ్, సిద్దాల చిన్న బీరప్ప, మాజీ అధ్యక్షుడు కామేష్ రెడ్డి, మదారి రమేష్, విజయ్, శీను నాయక్, గోపి యాదవ్, ప్రవీణ్ రెడ్డి, నర్సిరెడ్డి, మాజీ మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృపేష్, నిర్మలారెడ్డి, బిందు తదితరులు పాల్గొన్నారు.
