ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, ధన్నూర్(బీ)లో జొన్నలు అమ్మకానికి తెచ్చిన తడవకుండా ఉండేందుకు నానా పాట్లు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డులో జొన్నల సంచులు తడిశాయి.

బోథ్/ఉట్నూర్/ఉట్నూర్ రూరల్/సిరికొండ/పెంబి, జూన్ 4 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, ధన్నూర్(బీ)లో జొన్నలు అమ్మకానికి తెచ్చిన తడవకుండా ఉండేందుకు నానా పాట్లు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డులో జొన్నల సంచులు తడిశాయి. చుట్టూ నీరు నిలవడంతో నీటిని తొలగించేందుకు ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్లపై నిలిచిన నీటిని తొలగించారు.
