లేదంటే భారీ ధర్నా: అర్కల కామేష్ రెడ్డి

బాలాపూర్, మే 13:( శ్రీరామ్ చక్రి న్యూస్) బాలాపూర్ మండలంలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువుల్లో విస్తరించిన గుర్రం టెక్క, చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని మీర్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయా చెరువులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే Sabitha Indra Reddy ఆదేశాల మేరకు చెరువుల సందర్శన చేపట్టినట్లు తెలిపారు. చెరువుల్లో గుర్రం టెక్క విస్తరించడంతో పాటు చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని, దాంతో దోమలు, క్రిమికీటకాలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువుల సుందరీకరణ చేపట్టి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చెరువులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకుని వారం నుంచి పది రోజుల్లోగా గుర్రం టెక్క, చెత్తాచెదారం తొలగించాలని డిమాండ్ చేశారు.లేకపోతే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భూపేష్ గౌడ్, అనిల్ కుమార్ యాదవ్, సిద్ధాల బీరప్ప, సునీత బాలరాజ్, మాధవి, బిందు, లక్ష్మణ్, సంతోష్, యాదగిరి రెడ్డి, రవీందర్ రెడ్డి, చారి, రజాక్ బాయ్, సిద్ధాల భారత్, దయానంద్, జగాల్ రెడ్డి, శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు.
