కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి.

బీఆర్ఎస్ హయాంలో దూసుకుపోయిన పల్లెలు.. ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉండగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 399 పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఎన్నుకున్నారు. దస్తురాబాద్ మండలంలోని పెర్కపెల్లి గ్రామంలో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో ఎన్నిక జరుగలేదు. రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో సాగిన పల్లెలు.. ఇకపై సర్పంచ్, వార్డు సభ్యుల పాలనలో ముందుకు సాగనున్నాయి.
