కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 లోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియను ఇంజనీరింగ్ అధికారులు చేపట్టారు.

ధర్మారం: ఆపదలో ఉన్న అన్నదాతలకు కాళేశ్వరం ప్రాజెక్టు అండగా నిలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం దూర దృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతూ పంటలకు ప్రాణం పోస్తుంది. వివరాలలోకి వెళితే.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా చేపట్టిన రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువకు అనుబంధంగా సాగుచేసిన పంటల సంరక్షణ కోసం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రక్రియను నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలోని గాండ్లపేట వద్ద వరద కాలువకు గండి పడటంతో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో వరద కాలువలో నీరు లేకపోవడం అట్టి కాలువ ఎగువ బాగాన రైతులు సాగుచేసిన వరి పంటలకు నీటి సరఫరా లేకపోవడంతో నీటిని విడుదల చేయాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు
