
డిసెంబర్ 27( శ్రీరామ్ చక్రి న్యూస్) జిలెల్లగూడలోని ఇండియన్ స్కూల్లో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ వైస్ చైర్మన్ భవాని దత్త, చైర్మన్ నరేన్ దత్త ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రిస్మస్ పండగ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. భారతదేశం అన్ని మతాలు కలిసి ఉన్న దేశమని, ప్రతి మతాన్ని గౌరవించుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అన్ని పండగలను ఐక్యతతో, ఘనంగా నిర్వహించడంలో ఇండియన్ స్కూల్ యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులు శాంతాక్లాస్ వేషధారణల్లో వివిధ నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
