
డిసెంబర్ 18 (శ్రీరామ్ చక్రి న్యూస్) నూతనంగా ఎన్నికైన మహేశ్వరం మండల సర్పంచులను అభినందించిన అందెల శ్రీరాములు మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలో నిన్న నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు, తమ వార్డు సభ్యులతో కలిసి మండల అధ్యక్షులు యదీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారిని నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు పాలకవర్గాన్ని శ్రీరాములు గారు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సర్పంచులు గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని తెలిపారు.రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహం, సత్తాను కొనసాగించి భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీ అందించాలని నాయకులను కోరారు.
ఈ కార్యక్రమంలో,డబుల్ గూడ సర్పంచ్ బుగ్గాని యాదమ్మ యాదయ్య,పెద్దమ్మ తండా సర్పంచ్ రవి నాయక్,
గొల్లూరు సర్పంచ్ ధార నరసింహ,వార్డు సభ్యులు, బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, బీజేవైఎం నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
