
కమలానగర్ స్ఫూర్తి క్లబ్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు మణిపాల్ రెడ్డి నాలుగో వర్థంతి సందర్భంగా, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వ హించారు. ఈ క్రమంలో యాప్రల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ‘ఆల్ ఇన్ వన్’ పుస్తకాలు పంపిణీ చేశారు.
మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కలిసి విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుషాయిగూడ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ నల్లమోతు వెంకటరమణ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మణిపాల్ రెడ్డి నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన ఎల్లప్పుడూ సేవాభావంతో ప్రజల కోసం ఆలోచించేవారు. అలాంటి మంచి మిత్రుడిని కోల్పోవడం బాధాకరం,” అని అన్నారు. మణిపాల్ రెడ్డి స్ఫూర్తితో లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్, రాజీవ్, డీసీఎస్ రవి యాదవ్, డీసీటీ కిరణ్ కుమార్, ఆర్.సి. శ్రీధర్ గౌడ్, చీఫ్ కోఆర్డినేటర్ సంపత్ కాశపి రెడ్డి, జీఎస్టీ కన్నన్, ప్రెసిడెంట్ వెంకటకృష్ణారెడ్డి, సెక్రటరీ సుధాకర్ రెడ్డి, రూపా రెడ్డి, లక్ష్మీ మూర్తి, శేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమాదేవి, వంజరి ప్రవీణ్, అచ్చయ్య, సాంబశివరావు, సంజీవరెడ్డి, రామాచారి, హరినాథ్, మధుసూదన్, కాశీనాథ్, రాజేంద్ర ప్రసాద్ రాజు, రాజేష్ చోడే, సురేందర్, పద్మావతి, శ్రీలత, విజయ్ కుమార్, గోవర్ధన్, రాము, రాజేష్, అరుణ్, ఉమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
