గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సవాల్ విసిరారు

ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. బీసీలను నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని భద్రాద్రి జిల్లా పర్యటనకు వస్తున్నాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
