గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు అని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు.

ఎదులాపురం,: గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు అని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లైబ్రెరీలో గ్రంథాలయ వారోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రెరీలు ఉండేవి కాదని, పట్టణ ప్రాంతాలకెళ్లి చదుకోవాల్సి వచ్చేదన్నారు.
