సెంట్రల్ లైబ్రరీ వద్ద జాగృతి అధ్యక్షురాలు కవితను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
గ్రూప్ – 1 పరీక్షల రద్దుతో నిరాశ చెందిన అభ్యర్థులను పరామర్శించేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్లేందుకు ప్రయత్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత , ఆమెతో కలిసి ఉన్న జాగృతి నాయకులు అక్కడే ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పరీక్ష రద్దుతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న అభ్యర్థులను పరామర్శించడమే మా ఉద్దేశం. అలాంటి సందర్భంలో కూడా ప్రభుత్వం భయంతో పోలీసులతో అడ్డుకోవడం విచారకరం,” అని కవిత విమర్శించారు.
“గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు ఎత్తి చూపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ఇదేనా ప్రజాస్వామ్యం?” అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
