దంచికొడుతున్న ఎండల ప్రభావంతో పాలేరు జలాశయ నీటిమట్టం క్రమక్రమంగా తగ్గిపోతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతానికి 15.10 అడుగులకు పడిపోయింది

నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల కాకపోతే మిషన్ భగీరథ ద్వారా 700 గ్రామాలకు కటకట ఏర్పడనున్నది. రెండేళ్ల క్రితం పాలేరు జలాశయం పూర్తిగా అడుగంటిపోయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. ఈ క్రమంలో మిషన్ భగీరథ, నీటిపారుదల శాఖ అధికారులు జేసీబీల సహాయంలో కాల్వలు కొట్టి నీటిని మిషన్ భగీరథ పంపుహౌస్ వరకు మళ్లించారు. దీంతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు పాలేరు ఇన్టేక్ వెల్ ద్వారా తాగునీటిని అందించారు
