కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.

కామారెడ్డి, జూన్ 4: పోరాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ పదేండ్లలో దేశంలోనే నంబర్‌వన్‌గా చేస్తే రెండున్నరేండ్లలోనే రేవంత్‌రెడ్డి సర్వనాశనం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సక్కగా నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై రేవంత్ రెడ్డి రూపంలో ఒక పెద్ద బండరాయి వచ్చి పడిందన్నారు. రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సదస్సులో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎరువులు, యూరియా కొరత లేకుండా రికార్డు స్థాయిలో నిరంతరాయంగా సరఫరా చేశామని గుర్తు చేశారు.
