పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని, అక్కడ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే .

ఏటా వచ్చే వరదల వల్ల భద్రాచలం ప్రాంతంలోని ఆయా గ్రామాల ప్రజలు ఇప్పటికే నష్టపోతున్నారని, గోదావరి కరకట్టల ఎత్తు పెంచి ముంపు నుంచి ప్రజలను కాపాడాలని, తూతూమంత్రంగా సర్వే చేయకుండా సర్వే చేసిన రిపోర్టును ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. 2022లో బ్యాక్‌వాటర్ వల్ల నష్టపోయిన భద్రాచలం ముంపు బాధితులు దాదాపు లక్ష మందికి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో తరచూ నీటమునిగిపోతున్న 2వేల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రత్యేక వసతి కల్పించాలన్నారు.
