రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. యువతలను క్రీడల్లో భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు.

రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 18: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ జోరుగా సాగుతున్నది. యువతలను క్రీడల్లో భాగస్వామ్యం చేయడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేటీఆర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈనెల 10న మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. వారం రోజులపాటు హోరాహోరీగా మండల స్థాయి పోటీలు జరిగాయి. జిల్లాలోని అన్ని గ్రామాల మధ్య క్రికెట్ పోటీలు మండల స్థాయిలో నిర్వహించారు. మున్సిపల్ స్థాయిలోనూ వార్డులవారీగా పోటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50వేలు, ద్వితీయ స్థానం జట్టుకు రూ.25వేలు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కు రూ.5వేలు నగదు పురస్కారంతోపాటు కప్ లను, పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు మెడల్స్ అందిస్తున్నారు.
