సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు.

సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ఐక్య ఉద్యో గ సంఘాల ఆధ్వర్వంలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కుమా ర్ దీపక్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లా ఐక్య ఉ ద్యోగ సంఘాల చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రెటరీ వనజారెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీజీఈజేఏసీ కో చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీనివాస్ రావు దేశపాండే పాల్గొన్నారు.
