కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలంతా విసుగెత్తిపోయారని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనే బాగుందని, మళ్లీ ఆయనే రావాలని ప్రజలందరూ కోరుకుంటాన్నరని చెప్పారు.

ప్రతీ గ్రామం నుంచి పెద్దసంఖ్యలో తరలిరావాలని, సభను జయప్రదం చే యాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సభ నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన జగిత్యాల నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ముందుగా జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్, అనంతరం సారంగాపూర్, బీర్పూ ర్.. ఆ తర్వాత రాయికల్‌లో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయాచోట్ల జన సమీకరణ, వాహనాల ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల పోరాటాల గడ్డ అని గుర్తు చేశారు. ఈ గడ్డపై కేసీఆర్ నిర్వహించే సభకు ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడిలా కదలాలని పిలుపునిచ్చారు.
