గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నాణ్యత లేని ఆహారం పెడతుున్నారని విద్యార్థులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మంచి భోజనం పెట్టాలని ప్రశ్నిస్తే కొడుతున్నారని.. బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎవరూ స్పందించకపోవడం వల్ల రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నామని చెప్పారు.
