యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.

నకిరేకల్, ఏప్రిల్ 6 : యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని 14 సెంటర్లకు గాను కేవలం 4 సెంటర్లను మాత్రమే ప్రారంభించారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మొత్తం ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా చీమలగడ్డ-1, చీమలగడ్డ-2, చందుపట్ల, తాటికల్లు కేంద్రాలను ప్రారంభించగా, నెల్లిబండ, మంగళపల్లి, నెల్లిబండ కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదు.
