గులాబీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై మూడు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ సక్సెస్ అయ్యింది

గులాబీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై మూడు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ సక్సెస్ అయ్యింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని అద్దాలు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకుల తీరుకు నిరసనగా బంద్ చేపట్టారు. సోమవారం అన్ని వర్గాల వ్యాపారులు, ప్రజలు, ప్రైవేట్ పాఠశాల సిబ్బంది పాల్గొనడంతో విజయవంతంగా ముగిసింది. తెల్లవారుజాము న గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో నుంచి బస్సు లు బయటకు రాకుండా గేట్ ఎదుట బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. డిపో ఎదుట ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు బీఆర్ఎస్ నాయకులు బస్సులు బయటకు రాకుండా బైఠాయించారు.
